President & Chairman Message

Message From President & Chairman

 నెహ్రూ క‌ఠారు

టీఎల్ సీఏ 2023 అధ్య‌క్షులు

తెలుగు సార‌స్వ‌త సాంస్కృతిక సంఘం (TLCA)
స‌భ్యులంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు 

ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలుగు సార‌స్వ‌త సాంస్కృతిక సంఘం (TLCA)

స‌భ్యులంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. అమెరికాలో అతి ప్రాచీనమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సంస్థ ‘తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం’ (TLCA)కి 43వ అధ్యక్షునిగా సారథ్యం వహిస్తూ మీ అందరకు సేవ చేయగలగడం నా పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాను.

మన తెలుగు భాష ,
మన సాహిత్యం ..
మన కళలు ,

మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో గత ఐదు దశాబ్దాలు గా విశేష కృషిని, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా .. ఎన్నో తెలుగు సంస్థలకు మాతృకుగా అనేక సేవలు అందిస్తున్న మన టి ఎల్ సి ఎ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ .. ఈ సంపదను మన భావితరాల వారికి అందించి వారిని మన వారసులుగా తీర్చిదిద్దాలి అనే దృఢసంకల్పము తో మీ ముందుకు వస్తున్నాను .

టి.ఎల్.సి.ఎ వేదిక మీద తెలుగు భాష ప్రదర్శనకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వటం, పద్యానికి పట్టం కట్టటం, మన ఇతిహాసాల మీద పిల్లలకు పూర్తి అవగాహన కల్పించటమే ల‌క్ష్యంగా కార్య‌క్ర‌మాలు చేపడుతున్నాం.

టి.ఎల్.సి.ఎ కార్యక్రమాలలో చిన్నారులుగా పాల్గొన్న‌వారు యువ‌త‌గా మనకు దూరం అవుతున్నారు. మన సంఘంతో యువ‌త అనుబంధం కొన‌సాగాలంటే వారినే భాగ‌స్వాములుగా చేసి వారిచే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. యువత తరచుగా కలిసేలా వేదిక‌లు ఏర్పాటుచేసి, వారిలో స్నేహ భావం పెంపొందించి, తద్వారా వారి ప్రమేయంతో కార్యక్రమాలు నిర్వహించటం, ఈ సంవత్సరం మేము తలపెట్టిన అతి ముఖ్య కార్యక్రమం.

వినోద కార్యక్రమాలు, తెలుగు సాహిత్య కార్యక్రమాలు, యోగ సాధన లాంటి కార్యక్రమాలు య‌థావిధిగా కొనసాగుతాయి.

ఏభై ఏళ్ల‌కు పైగా మన టి.ఎల్.సి.ఎ కు వెన్నుదన్నుగా వుంటూ, సహృదయంతో ఆర్ధిక సహకారాన్ని అందిస్తూ సంస్థ యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతున్న దాతలకు, సంస్థ చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న సభ్యులకు, మన తెలుగు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్న చిన్నారులకు, తల్లిదండ్రులకు, గురువులకు, సంస్థ దీర్ఘ కాలిక అభివృద్ధికి దోహద పడుతున్న ధర్మకర్తల మండలికి (BOT) ,సంస్థకు సారథ్యం వహించి ముందుకు తీసుకు వెళ్ళటానికి చక్కని బాటను ఏర్పాటు చేసిన మన సంఘ పూర్వాధ్యక్షులకు, పూర్వ కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా మన ప్రవాస తెలుగు వారందరికీ .. నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధముగా మీ అందరి ఆదరాభిమానలను కోరుకుంటూ.. “భాషే మన బంధం - యువతే మన భవిత”

మీ
నెహ్రూ క‌ఠారు
టీఎల్ సీఏ 2023 అధ్య‌క్షులు

Dr. Ankineedu Prasad Nannapaneni
Chairman

Dear Members of Telugu Literary & Cultural Association,

I am proud to serve as the Chairman of the Board of Trustees, TLCA, an organization I have been involved in for more than a decade ago. I express my sense of indebtedness to the entire Board of Trustees, TLCA, for trusting me to lead an organization established over 50 years ago and the first Telugu organization in North America led by many legends in the Telugu Community.

As one of the oldest nonprofit organizations in the country, TLCA invested in building the best community possible. We believe that begins with our children; as we instill cultural values to our next generations, TLCA helps create the environment for the children by giving them a solid foundation with all the cultural and literary activities.

In 2021, we celebrated 50 years of being, Here for Good. It was an excellent opportunity to relive our founding and all the great things accomplished by our executive committee, board, youth, donors, community partners, and volunteers of the TLCA. We thank everyone who has been part of our success. We couldn’t have done it without you!

My goal is to


Inspire donors to make effective charitable decisions through our donor-centric approach to philanthropy.

Nurture The TLCA unrestricted assets to provide for diverse community needs for generations to come.

Listen to the needs of our donors, youth, volunteers, and our community as a whole. Collaborate to support imaginative solutions to build relations and work closely with other nonprofits and community leaders.

These are big goals, and I believe we are well prepared to meet them because of the Core Values that drive us: A commitment to the public good; transparency, integrity, and honesty; accountability and responsible stewardship; commitment to brilliance and maintaining the public faith, embracing diversity and inclusion, making philanthropy equitable for all.

Join us in our voyage, our community needs you, and as we work together, our mission is possible!

Respectfully,
Dr. Ankineedu Prasad Nannapaneni Chairman Board of Trustees, TLCA
© 2020 Telugu Literary & Cultural Association. All rights reserved.